ఓమౌజయః ఆధ్యాత్మిక రంగం ఈ భూ విశ్వంలోని అన్ని రంగాల కంటే భిన్నమైనది. ఆధ్యాత్మిక రంగానికి మూల కేంద్రం గురువు. కావున గురువే ఈ సమస్త విశ్వమునకు మూలము. వ్యక్తిగతం, కుటుంబం, రాజకీయం, వ్యాపారం, ఆధ్యాత్మికం మొదలైనవి సద్గురువు మార్గదర్శకత్వంలో నడిస్తే అన్నీ శుభప్రదమే.
ఆధ్యాత్మికత అనేది మార్గం లేని మార్గంలో నడిపించే ప్రయాణం లాంటిది. ఆధ్యాత్మికతలో మొదటి నుంచి అంతిమ గమ్యం వరకు తలెత్తే ప్రశ్నలకు, సందేహాలకు సమాధానాలు ఇస్తూ ముందుకు సాగేందుకు దారి చూపే మార్గదర్శి, సద్గురువు. సద్గురువు మన జీవితానికి మార్గదర్శకులైతే ఆ జీవితం సార్థకమవుతుంది. సముద్ర ప్రయాణానికి దిక్సూచి ఎంత అవసరమో, మానవ జీవితానికి మోక్ష యాత్రకు సద్గురువు అంతే అవసరం.
ఓమౌజయః ఓమౌజయః ఓమౌజయః