డిసెంబర్ 3న కైకలూరులో వైద్య శిబిరం:
ప్రియతమ సద్గురువు జైమహావిభోశ్రీ గారి జన్మ దినోత్సవ వేడుకల సందర్భంగా, ఓం నమోస్తుతే క్షేత్రం (ది సెలబ్రేటింగ్ పాత్ అఫ్ ఎన్లైటెన్మెంట్ ఆంధ్రప్రదేశ్లోని కైకలూరు శాఖ .) కైకలూరులో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించింది. డాక్టర్ కామినేని శ్రీనివాస్ (ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి) మరియు మాగంటి బాబు (పార్లమెంటు సభ్యుడు) ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ శిబిరంలో నేత్ర, పీడియాట్రిక్, ఈఎన్టి, మరియు జనరల్ మెడిసిన్ వైద్యులు వివిధ వ్యాధులకు పరీక్షలు నిర్వహించి రోగ నిర్దారణ చేసి ఉచితంగా మందుల పంపిణీ చేశారు . సుమారు 300 మంది సంస్థ అందించిన సేవలను వినియోగించుకున్నారు. శ్రీ కె బలరామరాజు(అధ్యక్షుడు) మరియు డా.ప్రశాంతి మరియు భక్తోమౌయుల గ్రూప్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయింది.
భోజన ప్యాకెట్ల పంపిణీ
ప్రేమ మరియు గౌరవానికి చిహ్నంగా పూల గుత్తి మరియు రుచికరమైన వంటకాలు వైద్యులకు మరియు జైమహావిభోశ్రీ అనుచరులందరికీ అందించారు '.