!! ఓమౌజయ శ్రీ గురుభ్యోనమః !!
ఓమౌజయ పుణ్య పాద యాత్ర 2024 నవంబర్ 11 నుండి నవంబర్ 15 వరకు జరుగుతుంది. హైదరాబాద్, మేడ్చల్ జిల్లా రాంపల్లి ప్రాంతంలో ఉన్న ఓమౌజయ శ్రీ భవతి క్షేత్రంలో పుణ్య పాద యాత్ర ప్రారంభమై, సిరిసిల్ల, వెంకటాపూర్ గ్రామంలోని ప్రజ్ఞాన క్షేత్రం వరకు సాగుతుంది. ప్రజ్ఞాన క్షేత్రానికి చేరుకున్న తర్వాత, భక్తులు తలనీలాలు సమర్పించి, ఊర్జీషా ఆలయాన్ని సందర్శించి, ప్రసాదం స్వీకరిస్తారు. అనంతరం కార్తీక పౌర్ణమి నాడు ఓమౌజయ ప్రత్యేక సత్సంగం నిర్వహిస్తారు. ఓమౌజయ కార్తీక పౌర్ణమి ముద్రా ధ్యానాన్ని ఇస్తాడు. ఆ తర్వాత భక్తులందరూ దీపాలు వెలిగించి కార్తీక పూర్ణిమను జరుపుకుంటారు.
ఓమౌజయా వారు మొదటిసారి పాదయాత్ర చేసిన తరువాత కార్తీక పౌర్ణమి సత్సంగములో ఓమౌజయాః పుణ్య పాద యాత్ర గురించి, దాని విశిష్టత గురించి వివరించారు
ఓమౌజయా !!
ప్రపంచంలో పాదయాత్ర చేస్తే అధికారం వస్తుంది లేదా స్వర్గం ఇస్తుంది. కానీ ఆధ్యాత్మికంగా ఒక గురువు కోసం పాదయాత్ర చేస్తే గురువుతో నీకు అన్యోన్య బంధం ఏర్పడుతుంది. నీ శరీరంకు, గురువు శరీరంకు మధ్య, నీ శ్వాసకు, గురువు శ్వాసకు మధ్య, నీ గుండెచప్పుడు, గురువు గుండెచప్పుడు, నీలో ఉన్న ప్రాణం, గురువులో ఉండే ప్రాణం, నీ రక్తం యొక్క ప్రవాహం, గురువు రక్తం యొక్క ప్రవాహం, నీ దృష్టి, గురువు దృష్టి, నీ నవ్వు, గురువు నవ్వు, నీ కన్నీరుకు గురువు కన్నీరుకు మధ్య దూరం ఉండదు.
ఓమౌజయాః పుణ్యపాద యాత్రలో కొన్ని వందల కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చిన బిడ్డలకు ఓమౌజయాః యొక్క శుభాకాంక్షలు, అభినందనలు
కావున భక్తులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఓమౌజయా వారి దివ్య ఆశీస్సులు పొందాలని ఆశిస్తున్నాము.
ఆహ్వానించువారు
ఓమౌజయ ఏకోపాసన మహాధర్మం
మరిన్ని వివరాల కోసం సంప్రదించండి : శ్రీ ఋషి ప్రజ్ఞానానంద స్వామి – 76709 02154
మరింత ఆధ్యాత్మిక సమాచారం కోసం
మీ భక్తిని మరింతగా పెంచుకోవడానికి ఆధ్యాత్మిక విషయాలపై మరిన్ని కథనాలను కనుగొనడానికి, మాని తనిఖీ చేయమని నేను మీకు సిఫార్సు చేస్తున్నాను ఉపన్యాసాలు.
బాహ్య సూచనలు
మరింత దైవిక కంటెంట్‌ని కనుగొనడానికి, మీరు సందర్శించవచ్చు shreeprabhu వెబ్సైట్