ది సెలబ్రేటింగ్ పాత్ అఫ్ ఎన్లైటెన్మెంట్మ ట్రస్ట్ ప్రియతమ సద్గురు పరమ పూజ్య, జైమహావిభోశ్రీ వారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించింది . జైమహావిభోశ్రీ వారి జన్మదినాన్ని పురస్కరించుకుని సంస్థ పలు సామాజిక కార్యక్రమాలను నిర్వహించింది.
డిసెంబర్ 3వ తేదీన వంపుగూడ కమ్యూనిటీ హాల్లో ఉదయం 9.00 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంటల వరకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. శ్రీ. పత్తి కుమార్ వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఆంకాలజిస్ట్ డాక్టర్ అద్వైత, ఆయుర్వేద స్పెషలిస్ట్ డాక్టర్ కైవల్య రోగులకు రోగనిర్ధారణ చేసి వారికి రోగనివారణకు అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. శిబిరం పూర్తయిన అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ 500 మందికి పైగా రోగులకు సేవలందించడం ఆనందంగా ఉందన్నారు.
అదే రోజు మధ్యాహ్నం 3.00 గంటల నుండి 6.00 గంటల వరకు రాంపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో డాక్టర్ కైవల్య మరియు డాక్టర్ అద్వైత వైద్య శిబిరాన్ని నిర్వహించగా పలువురు భక్తోమౌజయులు వైద్య శిబిరాన్నిఘనంగా విజయవంతం కావడానికి అవసరమైన సేవలను అందించారు . సంస్థ 600 మందికి పైగా రోగులకు సేవ చేసింది.
ది సెలబ్రేటింగ్ పాత్ అఫ్ ఎన్లైటెన్మెంట్ ట్రస్ట్ మరుసటి రోజు కూడా , 4 డిసెంబర్ 2017న, సద్గురు జన్మ దిన యొక్క వేడుకల్లో భాగంగా రాంపల్లిలోని నిరుపేద ప్రాంతాలకు ఉచిత భోజనాన్ని అందించాయి. మధ్యాహ్నం 1.00 నుండి సాయంత్రం 5.00 గంటల వరకు 11 రకాల రుచికరమైన వంటకాలతో భోజనం అందించారు. ఈ కార్యక్రమంలో అతిథులు జ్యోతి రాంపల్లి, సర్పంచ్ లు చురుకుగా పాల్గొని మద్దతు తెలిపారు. ఆమె కూడ దయగల హృదయంతో ప్రేమతో అతిధులకు ఆహారాన్ని వడ్డించే సేవ చేసినందుకు సంస్థ ఆమెకు ధన్యవాదములు తెలియచేసింది. ఈ కార్యక్రమానికి కి రాంపల్లి కార్యదర్శి, వార్డు సభ్యులు కూడా హాజరై ప్రజలకు ఎంతో ప్రేమతో సేవ చేశారు. 1000 మందికి పైగా ప్రజలకు ఎంతో గౌరవంగా సేవలందించారు. మా పూజ్య సద్గురు జైమహావిభోశ్రీ వారి పర్యవేక్షణలో సంస్థ ద్వారా నిర్వహించబడిన అన్ని సేవా కార్యక్రమాలను భక్తోమౌజయులు మరియు AUYSA బృందాలు గ్రాండ్ సక్సెస్ చేశాయి.