వసుదైక కుటుంబ వేడుకల విశిష్టత:
కుటుంబము, వృత్తి, వ్యక్తిగత మరియు సామాజిక, దైనందిక జీవితంలో ఆరోగ్యంగా, ఆనందంగా, శాంతిగా, తృప్తిగా, సత్సంబంధాలతో, అభివృద్ధి, విజయంతో, కోరికలను మరియు లక్ష్యమును సఫలం చేసుకొని మానవ జన్మను గ ర్వంగా అనుభవించే, జీవించే అనుగ్రహమును ప్రాప్తింపచేసేది “ఓమౌజయాః వసుదైక కుటుంబ వేడుకలు”.
ముద్రా ధ్యానములో భక్తులు
శ్రీశ్రీశ్రీ పరమ పూజ్య మహా ప్రేమావతార స్వయంభూ:ఆదిపరబ్రహ్మ జైమహావిభోశ్రీః వారి దివ్యానుగ్రహముతో
వసుదైక కుటుంబ వేడుకలు ప్రతి సంవత్సరం ఓమౌజయాః ఏకోపాసన మహాధర్మాను సారముగా నిర్వహించడం జరుగుతుంది.
2023 లో జరుగనున్న వార్షికోత్సవ వేడుకలకు మంత్రులను, కమీషనర్లను, ప్రెసిడెంట్, కార్పొరేటర్ మరియు పలువురు ప్రముఖులకు వసుదైక కుటుంబ వేడుకల ఆహ్వాన పత్రికను అందించడం జరిగింది.
ఓమౌజయాః భక్తులు ఇంటింటికీ వెళ్ళి బొట్టు పెట్టి గౌరవముగా వారికి వసుదైక కుటుంబ వేడుకల ఆహ్వాన పత్రికను అందించడం జరిగింది.
వసుదైక కుటుంబ వేడుకల వార్షికోత్సవం:
2023 ఆగష్టు 27 న కొత్తపేట ఓమౌజయా విశ్వమహిళా సేవా సమితి వారి ఆధ్వర్యములో శోభాకృత నామ సంవత్సర శ్రావణ ఏకాదశి వసుదైక కుటుంబ వేడుకల వార్షికోత్సవం అంగరంగ వైభవముగా జరిగింది. కార్యక్రమం జయకేతనంతో ఆరంభించడం జరిగింది. తర్వాత భక్తులందరూ మహాచండీ యాగం మరియు కలశ పూజలో పాల్గొన్నారు. ఆ తర్వాత భక్తులు శ్రీ ప్రభుజీ వారి దివ్యానుగ్రహ సత్సంగములో పాల్గొనడం జరిగింది. మహాగురు ఓమౌజయా భక్తులకు ప్రత్యేక ముద్రను అందించారు. కుటుంబ జీవితానికి, ఆధ్యాత్మిక జీవితానికి, ఆర్థిక జీవితానికి, మహిళలకు సంబంధించి ఎన్నో ముఖ్యమైన సూత్రాలను, అమూల్యమైన విషయాలను చెప్పడం జరిగింది. శ్రీప్రభుజీ వారు మహిళలను ఇంకా జ్ఞానవంతులను, చైతన్యవంతులను, శక్తివంతులను చేయుటకై ఆధునిక మహిళా – 21 ను ఆవిష్కరించడం జరిగింది. అంతేకాకుండా శ్రీప్రభుజీ వారు మహిళ యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ, తన స్వహస్తాలతో ఒక పాటను రాసి వసుదైక కుటుంబ వేడుకల వార్షికోత్సవం సందర్భముగా మహిళల కొరకు ఆ పాటను రిలీజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో BRS విమెన్ ప్రెసిడెంట్ పాల్గొనడం జరిగింది. అంతే కాకుండా వసుదైక కుటుంబ వేడుకల వార్షికోత్సవం గురించి మరియు మహిళ శ్రీప్రభుజీ వారి గొప్పతనం గురించి ప్రశంసించడం జరిగింది. తర్వాత భక్తులందరూ అన్న ప్రసాద వితరణ లో పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలందరికీ గౌరమ్మ మరియు సారెను అందించడం అనేది విశేషం.
ఎ.వి.ఎమ్.ఎస్ కార్యక్రమాలు:
1. ప్రతి నెల పౌర్ణిమ రోజున విశ్వమహిళా సేవాసమితి ఆధ్వర్యంలో శ్రీ శ్రీ శ్రీ పరమపూజ్య మహా ప్రేమావతార స్వయంభూః ఆదిపరబ్రహ్మ జైమహావిభోశ్రీః వారి యొక్క ప్రేమానంద యోగం మహా కుటుంబ ఆశీర్వాద సత్సంగము నిర్వహించబడును.
2. అనాథలకు, వృద్ధాశ్రమాలకు చేయూతనివ్వడము.
3. సమస్యలలో ఉన్న మహిళలకు వెన్నుదన్నుగా నిలబడడము.
4. ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు సహాయము చేయడము.
5. మొక్కలు నాటడం ద్వారా ప్రకృతిని సంరక్షించడము.
6. ఫ్రీ మెడికల్ క్యాంపులను నిర్వహించడము.
7. మహిళలను చైతన్యవంతం చేయుటకై ప్రత్యేక ర్యాలీలను నిర్వహించడము.
గమనిక : 11 సం॥ల పై బడ్డ బాలికలు, యువతులు, మహిళలు ఓమౌజయః విశ్వమహిళా సేవాసమితిలో ఉచితంగా సభ్యులు కావచ్చును. అలాగే వాలంటరీగా సేవాకార్యక్రమాలలో తమ వంతు పాలు పంచుకొన వచ్చును. సంప్రదించు ఫోన్ నెం. 7670902154.
ఆహ్వానించువారు
ఓమౌజయా: విశ్వమహిళా సేవా సమితి
ఓమౌజయాః శ్రీభవతి క్షేత్రం, ప్లాట్ నెం. 24, గోధుమకుంట, కీసర నుం॥, మేడ్చల్ జిల్లా, తెలంగాణ,
సెల్: 7670902154 Email: contact@aumaujaya.org