ఓమౌజయా! నా పేరు బి. శ్రీనివాస్, ధర్మంలో నా పేరు శ్రీమహా హిమబేర. నేను నిర్మల్ ఎలక్ట్రిసిటీ ఆఫీసులో పని చేస్తున్నాను. నాకు 2002లో పెళ్లయింది.పెళ్లయ్యాక 7 సంవత్సరాల వరకు నాకు సంతానం కలగలేదు. పలు ఆసుపత్రులకు వెళ్లినా ఫలితం లేకపోయింది. ఒకరోజు గురుపూర్ణిమ సందర్భంగా జైమహావిభోశ్రీ నిర్మల్‌కు వచ్చారు. తర్వాత వెళ్లి జైమహావిభిశ్రీని దర్శనం చేసుకున్నాము.
కొన్ని రోజుల తర్వాత, మేము హైదరాబాద్ ఆశ్రమానికి వెళ్లి, గురువును దర్శించుకుని, మాకు పిల్లల కోరిక గురించి చెప్పాము. అప్పుడు గురువు ఒక ప్రత్యేక ముద్ర- ధ్యాన పద్ధతిని సూచించారు. మేము క్రమం తప్పకుండా ముద్రా ధ్యానం చేయడం ప్రారంభించాము. ఆరు నెలల తర్వాత, నా భార్య గర్భం దాల్చింది. ఆ తర్వాత నెల రోజుల్లోనే జీవామృత దీక్ష చేపట్టాను. జైమహావిభోశ్రీ కృపతో ఇప్పుడు సంతోషంగా, ఆరోగ్యంగా జీవిస్తున్నాం.