వేచి ఉండండి
మా న్యూస్ లెటర్ కు సభ్యత్వాన్ని పొందండి మరియు మా తాజా వార్తలు మరియు కథనాలను ఎప్పటికీ కోల్పోకండి.
మా న్యూస్ లెటర్ కు సభ్యత్వాన్ని పొందండి మరియు మా తాజా వార్తలు మరియు కథనాలను ఎప్పటికీ కోల్పోకండి.
మే 12న భక్తులు మాతృదినోత్సవ వేడుకలు జై మహాఓజోమాతకు ప్రార్థనలు మరియు సాధనలతో ఘనంగా జరుపుకున్నారు. వేడుకలు విశ్వమాత అయినటువంటి జై మహాఓజోమాత ప్రేమకు చిహ్నం. కావున మహాఓజోమాత నామ స్మరణతో భక్తులు వేడుకలను ఘనంగా జరపుకున్నారు. జై మహాఓజోమాతపట్ల తమ ప్రేమ, కృతజ్ఞతలను తెలియజేసేందుకు భక్తులు ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. ఉత్సవాల్లో వారు పొందిన అద్భుత అనుభూతిని భక్తులు పంచుకున్నారు. జై మహఓజోమాత తల్లులందరికీ తల్లి, స్వచ్ఛమైన ప్రేమకు ప్రతీక. ఈ పండుగ మాతృత్వాన్ని మరియు దైవిక స్త్రీ శక్తిని గౌరవించటానికి అంకితం చేయబడింది.
వనమాతకి నైవేద్యాలు
ఉత్సవాల్లో భాగంగా వనమాత (శక్తిపీఠం) ముందు అందంగా అలంకరించిన కలశాన్ని సమర్పించారు. భక్తోమౌజయులు అలంకారణలో భాగంగా చీరలు, జాకెట్లు, గాజులు, పూల జడలు మరియు అనేక రకాల వస్తువులను సమర్పించారు. ఈ నైవేద్యాలతో పాటు, పండ్లు, పువ్వులు మరియు స్వీట్లు సమర్పించారు. భక్తులంతా ఎంతో భక్తితో ,కృతజ్ఞతా భావంతో సమర్పించారు.
కేక్ కటింగ్ వేడుక
సాయంత్రం, హాజరైన వారందరూ చిరునవ్వుతో, ఓజో మాత ముందు కేక్ కట్ చేసి అందరికీ పంచారు. ఈ సామూహిక సంఘటన భక్తుల మధ్య ఐక్యత మరియు అన్యోన్యతా భావాన్ని పెంపొందించింది.
ఆధ్యాత్మిక సాధనలు
ఉత్సవాల అనంతరం భక్తులు సంప్రదాయ పద్ధతుల్లో, సాధనల్లో నిమగ్నమవడంతో క్షేత్రమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. వారు ధర్మ శాస్త్ర గ్రంథ పఠనం, ధర్మం మరియు ఆధ్యాత్మిక జ్ఞానోదయం కలిగే భాగాలను చదివారు. జై మహాఓజోమాత దీవెనలు కోరుతూ భక్తులు జై మహాఓజోమాత మంత్రాన్ని పటిస్తూ హారతిలో పాల్గొన్నారు. జై మహాఓజోమాత ముందు దీపాలు దీపాలంకరణ చేసి ఆశీర్వాదాన్ని తీసుకున్నారు.
జై మహాజోమాత వేడుక అనేది మాతృమూర్తుల పట్ల గాఢమైన గౌరవం, ప్రేమతో చేసే ఒక శక్తివంతమైన వేడుక. అనేక ప్రదేశాలలో, భక్తులు ఈ పవిత్ర బంధాన్ని గౌరవించడానికి మరియు శాంతి, శ్రేయస్సు పొందటం కోసం దీవెనలు కోరేందుకు భక్తులంతా ఒకచోట చేరారు.
మీ భక్తిని మరింతగా పెంచుకోవడానికి ఆధ్యాత్మిక విషయాలపై మరిన్ని కథనాలను కనుగొనడానికి, మాని తనిఖీ చేయమని నేను మీకు సిఫార్సు చేస్తున్నాను ఉపన్యాసాలు.
మరింత దైవిక కంటెంట్‌ని కనుగొనడానికి, మీరు సందర్శించవచ్చు shreeprabhu వెబ్సైట్
Login to your account below.
1 వ్యాఖ్య
Good Postings ఓమౌజయా. Very informative articles.
Thank you ఓమౌజయా🙏🙏🙏