ఓమౌజయా – మాతృదేవోభవ

అమ్మ స్పర్శతో భగవంతుడు దీవిస్తాడు.

అమ్మ ఆశీర్వాదంలో భగవంతుడు ఆనందిస్తాడు.

అమ్మ ఆనందములో భగవంతుడు నిన్ను ప్రేమిస్తాడు.

అమ్మ కోసం నీవైతే నీకోసం ఓమౌజయా ఓమౌజయా ఓమౌజయా ఓమౌజయా..

నా శ్వాసకు తెలిసిన భాష నీకు కృతజ్ఞతలే అమ్మా..         ॥ 2  ॥ 

నా శ్వాసకు తెలిసిన భాష

వందనం అమ్మా వందనం    ||  4  ||

నా శ్వాసకు తెలిసిన బాష

అన్యులము మేము నీ బిడ్డలము

గర్విస్తుంది ఈ విశ్వమిక

నీ త్యాగ ఫలమే ఈ జగము

నీ యోగ ఫలమే నా జన్మము

నీ వర ఫలమే ఈ ప్రాణము

నీ అభయ ఫలమే నా సర్వము నాకు సర్వస్వము

ఓమౌజయ మహిళ ఓ విశ్వ మహిళ      ॥ 4 ॥     ॥నా శ్వాసకు ॥

జాగృతి మహిళ విశ్వ ప్రకృతి మహిళ

ప్రపంచ ప్రగతి మహిళ ఓ విశ్వ మహిళ     ||2 ||

ఓమౌజయ మహిళ జాగృతి మహిళ            ||2 ||

నవ సంస్కృతి మహిళ ఓ విశ్వ మహిళ     || 2 ||

ఓమౌజయా మహిళ ఓ విశ్వ మహిళా       ||2||         ||నా శ్వాసకు॥

కలకల్పన నవతారల సృష్టికే మాతృ మూర్తివి ఓ విశ్వమహిళ

యుగ యుగాల కాల ధర్మ చక్రముకే విశ్వ మాతవి ఓ విశ్వ మహిళ

తరతరాల మానవ జాతికే జీవన ధాతవి ఓ విశ్వమహిళ

అమోఘమైనది మహా ఘణమైనది.

అనిర్వచనీయమైనది ఓ విశ్వ మహిళ

సత్య శివ సుందర ఆనందమైనది. స్త్రీ నీ నామమే స్త్రీ నీ రూపమే ||2 ||

వెలుగుతూ వెలిగిస్తూ విశ్వమైనది ఈ విశ్వమైనది

ఓమౌజయ మహిళ ఓ విశ్వ మహిళ ||4||    ||నా శ్వాసకు||

అణువణువున శాంతిని వెదజల్లే అహింసమూర్తివి ఓ విశ్వ మహిళ

కణ కణమున తృప్తిని వెలిగించే క్షమామూర్తివి ఓ విశ్వ మహిళ

అడుగడుగున తోడు నీడగా ఉండే ప్రేమమూర్తివి ఓ విశ్వ మహిళ

త్యాగాల నిధివియోగాల విధివి

సర్వ కళ సన్నిధివి ఓ విశ్వ మహిళ

నిత్య నూతన శుభ లాభ ఐశ్వర్యమైనది.

స్త్రీ నీ నిష్టనే స్త్రీ నీ ఇష్టమే ||2||

గెలుస్తూ గెలిపిస్తూ అమ్మవైనవే మాకమ్మవైనవే

ఈ లోకముకే తల్లివైనవే

ఓమౌజయా మహిళ ఓ విశ్వ మహిళ || 4 ||        ||  నా శ్వాసకు || 

ధైర్య సాహసాలకు నీవే శక్తివి

చైతన్య మూర్తివి ఓ విశ్వమహిళ

సర్వ విద్య శాస్త్రములకు నీవే సామర్ధ్యమువి

త్యాగమూర్తివి ఓ విశ్వమహిళ

సర్వ ప్రతిభ కళలకు నీవే బీజమువి శ్రీః మూర్తివి విశ్వమహిళ

అవ్యయమైనది విశ్వాసమైనది సత్సంబంధమైనది దయ శ్రద్ధ సేవ దాన గుణ మైనది.

స్త్రీ నీ సంస్కారమే స్త్రీ నీ సభ్యతే ||2||

అభ్యుదయమై ఆధునికమై నాగరికతవై నవసమాజ మాతవు నీవే      ||ఓ విశ్వ మహిళ 7 ||

ఓమౌజయః సర్వస్యః నమస్తుభ్యం ॥27 ||

Share.

2 వ్యాఖ్యలు

Leave A Reply

తెలుగు