ఆది పరబ్రహ్మ సద్గురు నీవే జైమహావిభోశ్రీ ॥ 2 ||
అంతర్యామి ఆలకించవేమి
నీ చరణమే శరణం సదా స్మరాణి ||2||
నా కన్నులలో నీ రూపమే
నా పెదవులపై నీ నామమే
నా కనులలో దివ్య కాంతి నీవే కాదా ॥2॥ నే పలికే ప్రతి పలుకు నీవై లేవా…… నీవై లేవా…..
|| అంతర్యామి ||
కరములెత్తి పిలిచాను కనికరించరా ఆర్తితో పిలిచాను అనుగ్రహించరా ॥2॥
నా కరములలో చైతన్యం నీవే కాదా ||2||
నా ఆర్తి తపనవై నీవే లేవా…… నీవై లేవా……
నా అణువణువు నీ పరిమళమే.
నా ప్రతి కదలిక నీ కోసమే ॥2॥
నా తనువు అణువణువు నీవే కాదా ||2||
నా ప్రతి కదలికలో నీవే లేవా…… నీవై లేవా…….
నా ఊపిరిలో నీ ధ్యానమే
నా హృదయములో నీఆసనమే ॥2॥
నా ఉచ్చ్వాస నిశ్వాస నీవే కాదా నా హృదయ సామ్రాజ్యం నీవే కాదా…..నీవే కాదా…
నీ పాద ధూళియే మాకు భాగ్యమే.
నాకర్మకు కర్తవు నీవే కదా
నీ పాదధూళిలో రేణువు కానా…. రేణువు కానా…..
|| అంతర్యామి ||
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.