ఇక్కడ 10 కీలకాంశాలు ఉన్నాయి:

  • 01:
    . 'నాది'తో అనుబంధం బాధలకు కారణమవుతుంది:
    యాజమాన్యం మరియు అనుబంధం యొక్క భావాలు మానవ బాధలకు మూల కారణాలు.
  • 02:
    కోరిక మరియు స్వాధీనం:
    భౌతిక సంపద మరియు ఆస్తుల కోసం కనికరంలేని అన్వేషణ మనలను ఆధ్యాత్మిక సాక్షాత్కారానికి దూరం చేస్తుంది.
  • 03:
    దైవ యాజమాన్యం:
    మన శరీరాలు మరియు ఆస్తులతో సహా ప్రపంచంలోని ప్రతిదీ దైవానికి చెందినది; మేము కేవలం తాత్కాలిక వినియోగదారులు మాత్రమే.
  • 04:
    తాత్కాలిక అద్దె జీవితం:
    మన ఉనికి మరియు మనం ‘మాది’ అని చెప్పుకునేవన్నీ అద్దె ఇల్లు లాంటివి; వాటిని ఉపయోగించాలి కానీ స్వంతం కాదు.
  • 05:
    నిర్లిప్తత శాంతికి దారితీస్తుంది:
    ఏదీ నిజంగా మనకు చెందినది కాదని అర్థం చేసుకోవడం దుఃఖాన్ని అధిగమించడానికి మరియు అంతర్గత శాంతిని సాధించడంలో సహాయపడుతుంది.
  • 06:
    కృతజ్ఞతతో జీవించడం:
    మనకున్నదంతా దైవానుగ్రహం, కృతజ్ఞతా భావానికి దారితీస్తుందనే అవగాహనతో జీవితాన్ని గడపాలి.
  • 07:
    త్యాగం మరియు సేవ:

    త్యాగం, సేవ మరియు దానాల ద్వారా నిర్లిప్తతను పాటించడం ఆధ్యాత్మిక వృద్ధికి అవసరం.
  • 08:
    వినియోగానికి వ్యతిరేకంగా యాజమాన్యాన్ని అర్థం చేసుకోవడం:
    మనం ఒక కుర్చీని లేదా పత్రికను తాత్కాలికంగా ఉపయోగించుకున్నట్లే, మనం మన ఆస్తులను తాత్కాలికంగా పరిగణించాలి మరియు నిజంగా మనది కాదు.
  • 09:
    అంతర్గత సాక్షాత్కారం ద్వారా మార్పు:
    నిజమైన మార్పు మరియు ఆధ్యాత్మిక మేల్కొలుపు లోపల నుండి వస్తాయి; ఒకరు తమను తాము మార్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి, ఇతరులను కాదు.
  • 10:
    ఆధ్యాత్మిక బోధనలను స్వీకరించండి:
    ఆధ్యాత్మిక బోధనలు వాటిని అంగీకరించడానికి మరియు అన్వయించడానికి మనస్సు సిద్ధంగా ఉంటే మాత్రమే ప్రభావవంతంగా ఉంటాయి; లేకుంటే అవి నెరవేరకుండా ఉంటాయి.

బాధకు మూల కారణం: 'నేను' మరియు 'నాది'తో అనుబంధం

'నాది', 'నేను' అన్న భావనలు, కోరికలే దుఃఖ హేతువులు.. భూమి మీద జన్మించిన ప్రతి మానవుడూ తన కోసం ధనాన్నో, వస్తువులను సంపాదించుకోవడం కోసం పడరాని పాట్లు పడుతుంటాడు. కోరికలను జయిస్తే పరమాత్మకు దగ్గరవుతాము. బౌద్ధ మతం చెప్పే సారంశమిదే. వేదాంత సారాంశమూ ఇదే!

భౌతిక సంపద మరియు కోరికల నిష్ఫలత

ప్రపంచంలో నాది అని అనుకునేవేవీ నావి కాదు. అన్నీ పరమాత్మవే. ఇంటికి నేను యజమానిని, విశ్వానికి పరమాత్మ యజమాని. గృహం విశ్వంలోదే. విశ్వం నుంచి వేరు కానిదే, అలాంటప్పుడు గృహం కూడా భగవంతునిదే. నేను అద్దెకు ఉoటున్నాను. అంతే, అద్దెకు ఉండేవాడు ఇంటిని, ఇంటిలోని సౌకర్యాలను వినియోగించుకుంటాడు. అలా చేయడంలో తప్పులేదు. 'ఇది నాది' అనుకుంటేనే బాధ. ఆ క్షణం నుంచే దుఃఖము ప్రారంభమవుతుంది.

విశ్వంలో మన స్థానాన్ని గ్రహించడం: మనం కేవలం అద్దెదారులం మాత్రమే

యజమాని ఇల్లు అద్దెకిచ్చినట్లు పరమాత్మ మనకు సమస్తాన్ని ప్రసాదించాడు. ఇల్లు ఇచ్చాడు. ఒళ్ళిచ్చాడు, కళ్ళు ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు. భార్య నిచ్చాడు. బిడ్డల్ని అనుగ్రహించాడు, ఆహారాన్నిచ్చాడు. పానీయాన్నిచ్చాడు. ఆస్తులిచ్చాడు. ఆత్మీయుల్ని ఇచ్చాడు. ప్రకృతినిచ్చాడు. ప్రాణాన్నిచ్చాడు.

దేవుని బహుమతులు తాత్కాలికమైనవి: దైవిక యాజమాన్యాన్ని అర్థం చేసుకోవడం

ఇవన్నీ మనకే, కాని, అవి మనవి కావు. బండి రాలేదని ప్లాట్ఫారం మీద కుర్చీలో కూర్చొని, 'నిరీక్షిస్తున్నాం. బండి వచ్చింది. లేచి బండినెక్కాం. అంతవరకు మనం కూర్చున్న కుర్చీని త్యజించి వెళ్ళాం. ఎందుకని? అది మనది కాదు. సర్కారు వారిది వస్తువు ప్రభుత్వానిది. వినియోగం మనది.

జీవితం యొక్క తాత్కాలిక స్వభావం

బండిపోతూ ఉంది. ప్రక్కన కూర్చున్న వారి చేతిలో పత్రిక ఉంది. అడిగి తీసుకున్నాం. చదువుకున్నాం. విషయాలు తెలుసుకున్నాం. స్టేషను వచ్చింది. వారి పత్రికను వారికిచ్చి దిగిపోతాం. పేపరు పక్క వారిది. వినియోగం మనది.

వినియోగం యొక్క సూత్రం: ప్రతిదీ ఉపయోగం కోసం, యాజమాన్యం కాదు

ఈ ప్రపంచంలో అంతా వినియోగమే. విని అర్ధం చేసుకోవడమే. ఈ సత్యం వంటబడితే ” బ్రతుకే నైవేద్యమవుతుంది. ఆ తరువాత ఏది లభించినా ప్రసాదంగా భావిస్తుంది.

లౌకిక సంపదల తాత్కాలిక స్వభావం తెలుసుకోవడం

బండి రాలేదని కుర్చీలో కూర్చుని నిరీక్షిస్తున్న మనం కాఫీ త్రాగటానికి లేచి వెడుతూ, "ఏమండీ! నా కుర్చీ చూస్తూ ఉండండి" అని చెప్పి వెళ్తాము. అంటే, మళ్ళీ వచ్చి వినియోగించుకుంటామని అర్థం. అక్కడ "నా కుర్చీ" అని పలికామే గానీ ఆ కుర్చీ మనది కాదని, సర్కారు వారిదని ఇతరులకు తెలియకపోయినా మనకు మాత్రం స్పష్టంగా తెలుసు. " నా కుర్చీ" అనేది సత్యం కాదు. అన్నీ అంతే. కుర్చీలో కూర్చొని బండి వచ్చిన క్షణాన నాది కాదని కుర్చీని వదలి లేచి వెళ్ళినట్లు, మృత్యువు ఆసన్నమైన క్షణాన సమస్తాన్ని వదలి ప్రయాణం సాగించాలి.

Aumaujaya - Steps towards truthఆలింగనం నిర్లిప్తత: దేవునికి చెందిన దానిని తిరిగి ఇవ్వడం

అద్దె ఇంటిని ఆనందంగా వదిలినట్లు, కుర్చీని ప్లాట్ఫారమ్ పైనే వదిలి బండెక్కినట్లు, బండిలో పేపరు చదివి బండి దిగేముందు అది ఎవరిదో వారికిచ్చినట్లు, ఈ ప్రపంచంలో మనకున్నవన్నీ పరమాత్మదే కనుక అతడు ఏ క్షణాన తిరిగి ఇవ్వమని అడిగినా ఆలోచించకుండా హాయిగా తిరిగి అప్పగించడానికి ఎప్పుడూ సంసిద్ధంగా ఉండాలి. ఇలా ఉండే వాడే భక్తుడు. భగవంతునికి ప్రియుడు.

ఆసక్తి యొక్క నిరంతరత్వం: 'నాది' అనిపించే దాన్ని వదిలేయాలనే సవాలు

ఈ సత్యాలన్నీ స్ఫటికం లాగ చక్కగా తెలుస్తూ ఉండినా 'నాది' అనే మమకారాన్ని మనిషి వదలలేదు. మమకారం చర్చించినంత తేలికగా పోదు. అహంకారం ఉన్నంత వరకు మమకారం దూరం కాదు.

త్యాగం యొక్క అభ్యాసం: విముక్తికి మార్గం

కనుకనే ఈ ప్రపంచంలో జీవించి ఉన్నంతకాలం ఏదో కొంత త్యాగం చేస్తూ పోవాలి. దానo చేస్తూ ఉండాలి. ఇవి చేయడంలో ప్రధానమైన విషయం సేవ అనే సత్యాన్ని అందరూ గ్రహించలేరు.

తయారీ యొక్క ప్రాముఖ్యత: పరివర్తన ఎందుకు లోపల ప్రారంభమవుతుంది

వంటలెన్నో తయారవుతున్నాయి, అయినా ఆకలి మంటలు తీరడం లేదు. అది వంట వారి తప్పుకాదు. వడ్డించే వాని తప్పుకాదు. తినడానికి అలవాటు పడనపుడు ఎన్ని వంటలు చేసి ఏo ప్రయోజనం? మస్తికాలు సిద్ధపడకపోతే పుస్తకాలు చేసేది ఏమి ఉండదు. బుద్ధి శుద్ధి పడకపోతే బోధలు రుచించవు. రుచించినా ఫలితాలను ప్రసాదించవు. మార్పును అందరూ వాంచిస్తారు. మారేందకు ఎవరూ సిద్ధపడరు. అవును. మార్పు చాలా బాధాకరమైనది. అందుచేతనే మారాలనుకున్న మనుషులు మారలేకపోతారు.

మీ స్వంత కీర్తి ప్రకాశిస్తుంది: పరివర్తనకు సహజ మార్గం

ఎవరు ఎవరినీ మార్చవలసిన పనిలేదు. మహిమలో తాను వెలుగుతూ ఉంటే, మార్పులు రాదలుచుకుంటే వస్తాయి. రాకూడదనుకుంటే విశ్రాంతి తీసుకుంటాయి. ఈ అవగాహన కాగలిగితే గొప్ప మార్పు వచ్చినట్టే.

Discourses by MahaGURU

బాహ్య సూచనలు

మరింత దైవిక కంటెంట్‌ని కనుగొనడానికి, మీరు సందర్శించవచ్చు shreeprabhu వెబ్సైట్

Share.
Leave A Reply

తెలుగు