ఓమౌజయః మానవుడు భగవంతుని సృష్టికి పరాకాష్ట. మనుషులు లేకపోతే ఈ భూమి ఉండదు. ఈ భూమి మనిషితో జీవిస్తోంది. మనిషి ఈ ప్రపంచానికి వెలుగు. మానవుడు ఈ భూలోకానికి మార్గదర్శకుడు, ఒక విధంగా ఈ భూమిపై మానవుడు మాత్రమే జీవం. ఇంత గొప్ప వరం పొందినందుకు మనం అదృష్టవంతులం , అటువంటి అదృష్టవంతమైన జీవితాన్ని పొందిన మనం నిజంగా ధన్యులము. అటువంటి ధన్యమైన మానవ జీవితానికి అంతిమ అర్థాన్ని సద్గురు సేవ ద్వారా మాత్రమే పొందవచ్చు. సేవ తప్ప జీవితంనకు ఆనందమును , ఏ యోగము , త్యాగము ఇవ్వజాలవు . సేవే జీవితానికి రాజమార్గం, సేవ చేసేవాడే దాన్ని పొందుతాడు. సేవ చేయాలనే ఆశయం ఉన్న వ్యక్తి నిజమైన వ్యక్తిత్వాన్ని పొందగలడు, సద్గురువు లేని జీవితం భగవంతుడు లేని దేవాలయం లాంటిది , సద్గురువును సేవించని జీవితం బూడిదలో పోసిన పన్నీరు లాంటిది . సద్గురు ప్రేమకు అర్హమైన జీవితం స్వేచ్ఛ మరియు విముక్తితో కూడిన జీవితం.
ఓమౌజయః ఓమౌజయః ఓమౌజయః