జీవితం ఒక యుద్ధం: సృజనాత్మక జీవన కళ.
ఓమౌజయ: .. జీవితము ఒక యుద్ధము. సృజనాత్మకముగా నీవు ప్రతి క్షణము యుద్ధము చేయడము నేర్చుకున్నప్పుడు నీ జీవితమును నీ ఇష్టానుసారముగా సృష్టించుకోగలవు. యుద్ధము చేయు కళను నీవు నేర్చుకుంటే త్రికాల విజయ వ్యక్తిత్వ వికాస జీవితమును పొందుతావు. యుద్ధమే జీవన దారి. నీవు నడకను నేర్చుకుంటే గెలుస్తావు, లేకుంటే ఓడిపోతావు. జీవితము ఒక నిచ్చెన ప్రతి క్షణము ఒక మెట్టు, గెలుపు మరియు ఓటమిలు రెండు అడుగులు. ప్రతి పరిస్థితి ఒక అవకాశము, ప్రతి అనుభవము ఒక పునాది. ప్రయాణమే జీవితమునుకు శక్తి, కృషియే జీవితమునకు ఫలము. నీవు ఏదైనా ఒక వృత్తి లేదా కళపై గట్టి పట్టును సాధించినట్టైతే నీవు ఏ రంగములోనైనా రాణించగలవు.
బంధాలను నిర్మించడం మరియు స్నేహపూర్వక పోటీలను స్వీకరించడం
నీవు ఎదగదలుచుకున్నప్పుడు నమస్తముతో మరియు అందరితో సత్సంబంధమును ఏర్పరుచుకొనుము. అంతేకాదు నీవు ఒక పోటీదారుడిని ఎన్నుకొని సత్సంబంధ శత్రుత్వమును పెంచుకొనుము. నీవు ఎంత ఎత్తుకు ఎదగాలనుకున్నప్పుడు అంత గొప్ప సవాలును స్వీకరించడం నేర్చుకో, అప్పుడు నీవు అనుకున్నది సాధించగలవు.
సమస్య-పరిష్కార ఆనందం: ఫలవంతమైన జీవితానికి ఇంధనం
సమస్యను పరిష్కరించడములోనే నిజమైన ఆనందమును నీవు పొందినట్లైయితే, నీ జీవితము నీకు ఫలము అవుతుంది. నీవు ఎన్ని సమస్యలను పరిష్కరిస్తే అంత గొప్ప శక్తివంతుడవు కాగలవు. నీవు ఎన్ని సమస్యలను స్వీకరిస్తే అంత సమర్థుడవు అవుతావు. ప్రతి సమస్యను నీవు ఎదగడానికి ఒక మెట్టుగా సద్వినియోగపరుచుకున్నప్పుడు నీవు నీ జీవితమును సాధించగలుగుతావు. నీముందు ఏదైతే ఉన్నదో అది నీకంటే అల్పమైనదని నీవు తెలుసుకున్నట్లైతే నీ జీవితము నీ వశమౌవుతుంది. భగవంతుడు సమస్య అనే తాళం చెవిని నీకిచ్చి నీ జీవితాన్ని నీకు ప్రసాదించినాడు. నీ జీవిత సంపదను నీవు పరిపూర్ణముగా అనుభవించి, నీవు నీవుగా వికసించడానికి సమస్య ఒకటే రాజమార్గమని తెలుసుకొనుము.
సమస్యలను ఎదుర్కోవడం: పురోగతి మరియు విజయానికి మార్గం
సమస్యను స్వీకరిస్తే నీకు పురోగమన జీవితము, సమస్యను తిరస్కరిస్తే నీకు తిరోగమన జీవితము ప్రాప్తిస్తుంది. సమస్య నుండి నీవు తప్పించుకునే ప్రయత్నము చేసినపుడు అది నీకు నష్టమును, సమస్యను నీవు ధైర్యముగా ఎదుర్కునే ప్రయత్నము చేసినపుడు అది నీకు లాభమును ప్రసాదిస్తుంది. సమస్య నీ జీవితానికి దిక్సూచి, నీ విజయానికి మార్గదర్శి. సమస్యకు మించిన గురువు లేడు. సమస్య జీవితమును నేర్పిస్తుంది. సమస్తమును అర్ధం చేయిస్తుంది. సమస్య నీవు స్వతంత్రుడిగా మరియు స్వేచ్ఛగా జీవించడానికి దోహదపడుతుంది. సమస్య నీవు ఎదగడానికి ఒక అవకాశము మాత్రమే. నిన్ను నీకు గుర్తుచేస్తున్నది. నీ స్థితిని, స్థానమును, స్థాయిని తెలియజేస్తుంది. సమస్యను సవాలుగా స్వీకరించి నిన్ను నీవు నిరూపించుకో. సమస్యకు నీవు సమాధానముగా జీవిస్తే, సమస్య దీపములా నీ జీవితమును వెలుగిస్తుంది. సమస్యకు నీవు సమస్యగా జీవిస్తే, సమస్య అగ్ని గుండమై నీ జీవితమును దహిస్తుంది. సమస్య నీ జీవితములోని చీకటిని తరిమివేసే వెలుగుయని గుర్తుంచుకొనుము.
నిర్ణయం తీసుకోవడం: ఆలోచన మరియు చర్య యొక్క శక్తి
నీవు సరియైన సమాచారమును సేకరించి సరియైన ఆలోచన చేయుము. నీవు ఎలా ఆలోచిస్తే అలా నీ జీవితము రూపుదాల్చుతుంది. అందుకే నీవు ఏదైతే ఆలోచిస్తావో అదే మాట్లాడుము. ఏదైతే మాట్లాడుతావో అదే చేయుము, ఏదైతే చేస్తావో అదే గుర్తుంచుకొనుము. ఏదైతే గుర్తుంచుకుంటావో దాని యెడలనే నిజాయితీగా ఉండుము. అప్పుడు నీవు ఏది సంకల్పిస్తే దానిని భగవంతుడు కూడా సంకల్పిస్తాడు. నీ జీవితములో ప్రతి క్షణము నీకు అనుకూలముగా సంభవిస్తుంది. నీ జీవితమును రచించుకొనే శక్తి నీకు ప్రాప్తిస్తుంది.
ప్రతి క్షణానికి విలువ ఇవ్వడం: ఆత్మగౌరవానికి పరాకాష్ట
మీ జీవితములో సంభవించే ప్రతి చిన్న పెద్ద సంఘటనకు మరియు విషయమునకు సమానమైన ప్రాధాన్యత ఇవ్వండి. మీ ప్రత్యేకతను మీరు గుర్తించి, మీ ప్రత్యేకతలో మీరు పరాకాష్టంగా ఎవరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయిన మీరు మీరుగా జీవించండి. మీరు విశ్వసించిన దానిని ఎవరు నమ్మిన నమ్మకపోయిన మీకు అది మంచి చేసినపుడు దానిని ఈ ప్రపంచము ఆత్మగౌరవము, ఆత్మప్రేమ కలిగిన గొప్ప వ్యక్తిత్వము గల వ్యక్తినే ఆదరిస్తుందని గుర్తుంచుకొనండి. ఎప్పుడు ఏ పరిస్థితిలోనైనగాని, సందర్భములోనైన గాని మిమ్ములను మీరు దిగజార్చుకునే పని చేయకండి. ముఖ్యంగా నశించకండి. ఎప్పుడు మీ విలువను పెంచే పనినే చేయండి. అహర్నిశలు సజీవముగా జీవించండి. మీ ప్రగతి కోసం మీరు నిరంతరం కృషి చేయండి. మీరు ఎప్పుడు ఆరోగ్యముగా, ఆనందముగా, ప్రశాంతముగా, సంతృప్తిగా జీవితమును జీవించడము కొరకు మీతో మీరు ప్రతిదినము ఎక్కువ సమయం గడపండి. అప్పుడు అసాధ్యములను సుసాధ్యం చేసే విజయమును మీరు పొందుతారు.
విజయానికి తొలిమెట్టు
జీవితమును అర్థం చేసుకోవాలనే తపన కలిగిన వ్యక్తికి ఈ ప్రపంచము ఒక విద్యాలయమౌతుంది. ప్రతి క్షణం నీకు గురువై, సందర్భమనే వేదిక ద్వారా, పరిస్థితి అనే భాషతో జీవిత పాఠాలను ఆచరణ ద్వారా అనుభవంలోనికి తీసుకువస్తుంది. ప్రతి అనుభవం నిన్ను శక్తివంతుడిగా మారుస్తుంది. ప్రతి సమస్య నిన్ను సమర్థుడిగా మారుస్తుంది. ప్రతి సమాధానం నిన్ను ప్రతిభావంతుడిగా మారుస్తుంది. నీవు దేనిని స్వీకరిస్తే అది నీ జీవితమునకు దారి అవుతుంది. దేనిని వ్యతిరేకిస్తే అది నీ జీవితంలో ఒక భాగము అవుతుంది. మంచి మరియు చెడు ఆలోచనల ద్వారా నీ జీవిత ప్రయాణమును చేస్తున్నావు. నీవు మంచి ఆలోచన చేస్తే నీ జీవితమునకు నీవే అధికారివౌతావు. నీవు చెడు ఆలోచన చేస్తే నీ జీవితమునకు ఇతరులు అధికారులు అవుతారు.
ప్రతి పాఠాన్ని మరియు సవాలును స్వీకరించండి మరియు వాటిని విజయవంతమైన మరియు సంతృప్తికరమైన జీవితం వైపు నడిపించనివ్వండి.
మరింత ఆధ్యాత్మిక సమాచారం కోసం
మీ భక్తిని మరింతగా పెంచుకోవడానికి ఆధ్యాత్మిక విషయాలపై మరిన్ని కథనాలను కనుగొనడానికి, మాని తనిఖీ చేయమని నేను మీకు సిఫార్సు చేస్తున్నాను ఉపన్యాసాలు.
బాహ్య సూచనలు
మరింత దైవిక కంటెంట్‌ని కనుగొనడానికి, మీరు సందర్శించవచ్చు shreeprabhu వెబ్సైట్