జీవితంలో సేవ యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడం.
చాలా మంది మేము సేవ ఎందుకు చేయాలి అని ప్రశ్నిస్తుంటారు. ఈ ప్రశ్నకు సమాధానంగా మహాగురు వారు ఈ విధంగా సమాధానమిచ్చారు.
జీవిత సవాళ్లను అధిగమించండి
మీ జాతకాలలో ఎన్నో దోషాలు ఉంటాయి, కొంతమందికి పెళ్ళి కాదు, కొంతమందికి ఉద్యోగం రాదు, కొంతమందికి సంతానం కలుగదు, కొంతమంది ఆస్తులు దొరకవు, కొంతమందికి ఇల్లు కట్టుకోవడం కష్టమవుతుంది, కొంతమందికి వాహనం కొనుక్కోవడం కష్టం అవుతుంది, కొంతమంది భోజనం దొరకడం కష్టం, కొంతమందికి సుఖంగా నిద్ర పోవడం కష్టం, ఆరోగ్యంగా బ్రతకడం కష్టం, గౌరవంగా ఉండడం కష్టం, మనల్ని ప్రేమించేవారితో ప్రేమగా ఉండడం కష్టం, మనల్ని ఇష్టపడేవారితో ఇష్టంగా ఉండడం ఇవన్నీ కష్టమైన పనులు అవుతాయి.
ఇవన్నీ ఎందుకు అవుతున్నాయంటే మీ శక్తి, సామర్థ్య, ప్రతిభలకు మీరు పదును పెట్టకపోవడం వల్ల. మీ శక్తిని మేల్కొల్పాలి, మీ సామర్థ్యాన్ని ముందుకు నడపాలి, మీ ప్రతిభను విస్తరింపచేయాలి, మీరు గుర్తింపులోకి రాగలగాలి. మీరు గౌరవాన్ని పొందగలగాలి, లాభాన్ని ఉత్పత్తి చేయాలి, శుభాన్ని ఉత్పత్తి చేసుకోవాలి, అభివృద్ధి పొందాలి, శుభాన్ని పొందాలి, విజయాన్ని సాధించాలి, అన్ని దారులలో కూడా మీరు ఎప్పుడూ చిరునవ్వుతో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి. ఇలా ముందుకు వెళ్ళాలంటే సేవా గుణాన్ని మీరు నేర్చుకోవాలి.
సేవ యొక్క శక్తి
సేవ చేసినప్పుడు మీ జాతక దోషాలు వెళ్ళిపోతాయి. ఒక వెలుగు ఉన్నప్పుడు చీకటి ఎలా బ్రతకలేదో అలాగే సేవ చేసే వ్యక్తిలో దుఃఖం బ్రతకజాలదు. సేవ చేసి చూడు నీ దుఃఖం నశిస్తుంది, సేవ చేసి చూడు భయం నశిస్తుంది, సేవ చేసి చూడు బాధ నశిస్తుంది, సేవ చేసి చూడు లోపాలు నశిస్తాయి, సేవ చేసి చూడు బలహీనతలు నశిస్తాయి, సేవ చేసి చూడు నీలో లోపాలు నశిస్తాయి, సేవ చేసి చూడు నీలో ఉన్నటువంటి అపోహలు నశిస్తాయి.
సేవ చేసి చూడు భగవంతుడు అనుభూతి లోనికి వస్తాడు, సేవ చేసి చూడు నీకు ఒక స్పష్టత వస్తుంది, సేవ చేసి చూడు నీకు తృప్తి వస్తుంది, సేవ చేసి చూడు నీకు శాంతి కలుగుతుంది. సేవ చేసి చూడు 24 గంటలు ఆనందాన్ని అనుభూతి చెందుతావు. నువ్వు వందల కోట్ల రూపాయలు సంపాదించినా కాని ఆనందాన్ని పొందలేవు కాని ఒక్క క్షణం ఒక వ్యక్తికి సేవ చేసి చూడు వాడు కృతజ్ఞతతో నీకు నమస్కారం చేసినప్పుడు, వాడు చిరునవ్వుతో నిన్ను చూసినప్పుడు నీ కోట్ల రూపాయలు ఆ చిరునవ్వుకు సమానం కాదు. అటువంటి ఆనందాన్ని ప్రసాదించే ఒకే ఒక శక్తి సేవ. సేవ చేసి చూడు ఆనందాన్ని అనుభూతి చెందగలుగుతావు. సేవ తప్ప ఈ విశ్వంలో ఏ ఆనందం లేదు. ఒక్కసారి సేవను అనుభూతి చెందడానికి ప్రయత్నం చేయి. ఓమౌజయాః
ఈ పేజీలో ముఖ్యాంశాలు
- సేవ లోపాలను తొలగిస్తుంది: ఇతరులకు సేవ చేయడం వలన మీ జాతకంలో ఉన్న దోషాలను తొలగించి, మరింత సంతృప్తికరమైన జీవితాన్ని పొందవచ్చు.
- వ్యక్తిగత వృద్ధిని మెరుగుపరుస్తుంది: సేవ ద్వారా, మీరు మీ శక్తి, సామర్థ్యాలు మరియు ప్రతిభకు పదును పెట్టవచ్చు, ఇది గుర్తింపు, గౌరవం మరియు విజయానికి దారి తీస్తుంది.
- ప్రతికూల ప్రభావాలను తగ్గిస్తుంది: సేవ దుఃఖం, భయం, నొప్పి, బలహీనతలు మరియు మూఢనమ్మకాలను తగ్గించడంలో సహాయపడుతుంది.
- దైవిక అనుభవాన్ని అందిస్తుంది: సేవలో నిమగ్నమవ్వడం వలన మీరు దైవిక అనుభూతికి దగ్గరగా ఉంటారు, స్పష్టత, సంతృప్తి మరియు శాంతిని అందిస్తారు.
- సాటిలేని ఆనందాన్ని తెస్తుంది: ఇతరులకు సేవ చేయడం వల్ల కలిగే ఆనందం అసమానమైనది మరియు భౌతిక సంపదతో పోల్చబడదు.
మరింత ఆధ్యాత్మిక సమాచారం కోసం
మీ భక్తిని మరింతగా పెంచుకోవడానికి ఆధ్యాత్మిక విషయాలపై మరిన్ని కథనాలను కనుగొనడానికి, మాని తనిఖీ చేయమని నేను మీకు సిఫార్సు చేస్తున్నాను ఉపన్యాసాలు.
బాహ్య సూచనలు
మరింత దైవిక కంటెంట్‌ని కనుగొనడానికి, మీరు సందర్శించవచ్చు shreeprabhu వెబ్సైట్