ఓమౌజయా – మాతృదేవోభవ
అమ్మ స్పర్శతో భగవంతుడు దీవిస్తాడు.
అమ్మ ఆశీర్వాదంలో భగవంతుడు ఆనందిస్తాడు.
అమ్మ ఆనందములో భగవంతుడు నిన్ను ప్రేమిస్తాడు.
అమ్మ కోసం నీవైతే నీకోసం ఓమౌజయా ఓమౌజయా ఓమౌజయా ఓమౌజయా..
నా శ్వాసకు తెలిసిన భాష నీకు కృతజ్ఞతలే అమ్మా.. ॥ 2 ॥
నా శ్వాసకు తెలిసిన భాష
వందనం అమ్మా వందనం || 4 ||
నా శ్వాసకు తెలిసిన బాష
అన్యులము మేము నీ బిడ్డలము
గర్విస్తుంది ఈ విశ్వమిక
నీ త్యాగ ఫలమే ఈ జగము
నీ యోగ ఫలమే నా జన్మము
నీ వర ఫలమే ఈ ప్రాణము
నీ అభయ ఫలమే నా సర్వము నాకు సర్వస్వము
ఓమౌజయ మహిళ ఓ విశ్వ మహిళ ॥ 4 ॥ ॥నా శ్వాసకు ॥
జాగృతి మహిళ విశ్వ ప్రకృతి మహిళ
ప్రపంచ ప్రగతి మహిళ ఓ విశ్వ మహిళ ||2 ||
ఓమౌజయ మహిళ జాగృతి మహిళ ||2 ||
నవ సంస్కృతి మహిళ ఓ విశ్వ మహిళ || 2 ||
ఓమౌజయా మహిళ ఓ విశ్వ మహిళా ||2|| ||నా శ్వాసకు॥
కలకల్పన నవతారల సృష్టికే మాతృ మూర్తివి ఓ విశ్వమహిళ
యుగ యుగాల కాల ధర్మ చక్రముకే విశ్వ మాతవి ఓ విశ్వ మహిళ
తరతరాల మానవ జాతికే జీవన ధాతవి ఓ విశ్వమహిళ
అమోఘమైనది మహా ఘణమైనది.
అనిర్వచనీయమైనది ఓ విశ్వ మహిళ
సత్య శివ సుందర ఆనందమైనది. స్త్రీ నీ నామమే స్త్రీ నీ రూపమే ||2 ||
వెలుగుతూ వెలిగిస్తూ విశ్వమైనది ఈ విశ్వమైనది
ఓమౌజయ మహిళ ఓ విశ్వ మహిళ ||4|| ||నా శ్వాసకు||
అణువణువున శాంతిని వెదజల్లే అహింసమూర్తివి ఓ విశ్వ మహిళ
కణ కణమున తృప్తిని వెలిగించే క్షమామూర్తివి ఓ విశ్వ మహిళ
అడుగడుగున తోడు నీడగా ఉండే ప్రేమమూర్తివి ఓ విశ్వ మహిళ
త్యాగాల నిధివియోగాల విధివి
సర్వ కళ సన్నిధివి ఓ విశ్వ మహిళ
నిత్య నూతన శుభ లాభ ఐశ్వర్యమైనది.
స్త్రీ నీ నిష్టనే స్త్రీ నీ ఇష్టమే ||2||
గెలుస్తూ గెలిపిస్తూ అమ్మవైనవే మాకమ్మవైనవే
ఈ లోకముకే తల్లివైనవే
ఓమౌజయా మహిళ ఓ విశ్వ మహిళ || 4 || || నా శ్వాసకు ||
ధైర్య సాహసాలకు నీవే శక్తివి
చైతన్య మూర్తివి ఓ విశ్వమహిళ
సర్వ విద్య శాస్త్రములకు నీవే సామర్ధ్యమువి
త్యాగమూర్తివి ఓ విశ్వమహిళ
సర్వ ప్రతిభ కళలకు నీవే బీజమువి శ్రీః మూర్తివి విశ్వమహిళ
అవ్యయమైనది విశ్వాసమైనది సత్సంబంధమైనది దయ శ్రద్ధ సేవ దాన గుణ మైనది.
స్త్రీ నీ సంస్కారమే స్త్రీ నీ సభ్యతే ||2||
అభ్యుదయమై ఆధునికమై నాగరికతవై నవసమాజ మాతవు నీవే ||ఓ విశ్వ మహిళ 7 ||
ఓమౌజయః సర్వస్యః నమస్తుభ్యం ॥27 ||