Aumaujaya Sri Parabrahma Yagnam - Premojassomaujaya. 22-6-2-2024

హోమం యొక్క సారాంశం

కేవలం తాను బ్రతకడం కోసం మాత్రమే కాక, కొంతవరకు నిస్వార్ధముగా ఇతరుల కోసం ఆలోచించి, పనిచేసే వారికే మంచి మనుస్సు ఉంటుంది. అలా మంచి మనసున్న వీరి నుంచే మంచి మాటలు వస్తాయి. మహర్షులు ఎన్నో సందర్భాలలో 'పరోపకారార్ధమిదం శరీరమ్' అని చెప్పారు. చెప్పటమే కాదు, ఆచరణలో చూపించారు. బహుషా అందుకే కావచ్చు మహర్షులకు వాక్ శుద్ధి ఉండేది. వారు ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా ఇతరుల 'కోసం ఎంతో కొంత చేసేవారు.

హోమం యొక్క ఉద్దేశ్యం

మహర్షులు మాట్లాడేది తప్పకుండా జరిగేది. మహర్షులు వివిధ ప్రయోజనాల కోసం రకరకాల హోమాలు చేసేవారు. తమ ఆశయాలను నెరవేర్చుకునేవారు ఇక్కడ గమనించవలసిందేమిటంటే మహర్షుల కోరికలన్నీ నేరుగా కాని, అంతర్గతముగా కాని ప్రజల కోసమే ఉ ద్దేశించి ఉండేవి - అంటే లోక కళ్యాణం కోసమే!

ఈ మధ్య కూడా శ్రీశైలం దగ్గర జరిగిన హోమం సందర్భముగా ఆకాశంలోంచి పెను పరిమాణములో పెద్ద శిల నదీ జలాల్లో పడడం, జలాలు తాటిచెట్టు ఎత్తున పైకి లేవటం పేపర్లలో కూడా. వచ్చింది.

హోమంలో సమిధల పాత్రAumaujaya Guru Pournami Yagnam

హోమాల్లో ఎన్నో రకాల సమిధలు వాడవలసి ఉంటుంది, ఒక్కో సమిధ ఒక్కో గ్రహానికి సంబంధించినదై ఉంటుంది. అంటే అన్నీ గ్రహాలు సమతుల్య స్థితిలో ఉంటేనే సృష్టి సక్రమంగా వుంటుంది. > అంటే వ్యాధులు లేకపోవడం, వర్షాలు సక్రమంగా పడడం ఇలాంటివి జరుగుతాయి. ఏ ఒక్క గ్రహానికి సంబంధించిన శక్తి (ఎనర్జీ) భూమి మీద తక్కువగా ఉన్న అసమతుల్యతలు ఏర్పడుతాయి. అందుకే పి ఆయా గ్రహానికి సంబంధించిన మూలికలు, ధాన్యాలతో, ఇతర వస్తువులతో హోమం చేస్తారు. సూలముగా ఇది హోమం చేయటంలో ఉద్దేశ్యం.

ప్రభావవంతమైన హోమం కోసం జ్యోతిషశాస్త్ర అంతర్దృష్టులు

ఈ హోమ ఫలాలు వ్యక్తిగతంగా కూడా అందుకునే విధంగా జ్యోతిష్యవేత్తలు కొన్ని సూచనలు చేశారు. ఎవరైనా ఒక వ్యక్తిపై నవగ్రహాలలో ఏదో ఒక గ్రహ ప్రభావం తక్కువగా ఉంటే దానికి సంబంధించిన రంగములో లేదా విషయంలో ఆ వ్యక్తికి వ్యతిరేక ఫలితాలు వస్తాయి. ఏ వ్యక్తి అయితే వ్యతిరేక ఫలితాలను అనుభవిస్తున్నాడో ఆ వ్యక్తి ఇంట్లో హోమం చేయిస్తే చక్కటి ఫలితాలు వస్తాయి.

ఉదాహరణకు రవి (సూర్యుని) గ్రహ ప్రభావం బాగా తగ్గిపోయి, అదే సమయంలో ఇతర గ్రహాలు కూడా అననుకూలముగా మారితే, ఆవ్యక్తికి మృత్యువు రావచ్చు లేదా ఆయుష్షు పరంగా తీవ్ర నష్టం జరగవచ్చు. దీనిని నివారించేందుకు సూర్యునికి సంబంధించిన ఉపశాంతి చేయమని సూచిస్తారు. తరుచుగా హోమాలను కూడా ప్రమాద నివారణకు సూచిస్తారు.

2023 Dhyana chaitanya Vihara Yatra - yagnam, mumbaiఈ హోమాలలో రకరకాల మూలికలు వాడుతారు. శనిగ్రహం అనుకూలత కోసం శమీ వృక్ష సమిధను, రాహువు కోసం గరిక ఉపయోగిస్తే, సూర్యానుగ్రహము కోసం అర్క సమిధను ఉపయోగిస్తారు. కేతు గ్రహ ఉపశాంతి కోసం దర్భను ఉపయోగిస్తారు. ఆయుర్వేదం ప్రకారం అర్కలో కుష్టు వ్యాధిని నయం చేసే శక్తి వుంది. శరీరంలో ఉత్పన్నమయ్యే వివిధ రకాల దోషాలను పోగొట్టగలిగే శక్తి ఈ మూలికకు ఉంది. అలాగే చంద్ర గ్రహ శాంతి కోసం మోదుగను వాడుతారు. అటు వైద్య పరముగా చూస్తే జీర్ణ వ్యవస్థను అద్భుతముగా పునరుజ్జీవింప చేసే శక్తి మోదుగకు ఉంది. రక్తాన్ని శుభ్రపరుస్తుంది. రావి చెట్టును గురు గ్రహోపశాంతి కోసం ఉపయోగిస్తారు. ఇది వివిధ కఫ దోషాలను రూపుమాపుతుందని ఆయుర్వేదంలో వుంది.

ఈ విధంగా చూస్తే హోమం ప్రత్యక్షముగా మన ఆరోగ్యానికి, పరోక్షముగా నవగ్రహాలపై ప్రభావం చూపుతుందని అర్థమవుతుంది. అయితే హోమ క్రమం గురించి క్షుణ్ణంగా తెలిసిన వారు హోమం చేస్తేనే హోమ ఫలం అందుతుంది.

మరింత ఆధ్యాత్మిక సమాచారం కోసం

మీ భక్తిని మరింతగా పెంచుకోవడానికి ఆధ్యాత్మిక విషయాలపై మరిన్ని కథనాలను కనుగొనడానికి, మాని తనిఖీ చేయమని నేను మీకు సిఫార్సు చేస్తున్నాను ఉపన్యాసాలు.

బాహ్య సూచనలు
మరింత దైవిక కంటెంట్‌ని కనుగొనడానికి, మీరు సందర్శించవచ్చు shreeprabhu వెబ్సైట్

Share.
Leave A Reply

తెలుగు