Leave the low and middle state and embrace the transcendent. 

నీకు అధమమైన దానిని నీవు స్వీకరించవలదు. నీకు మధ్యమమైన దానిని నీవు స్వీకరించవలదు. నీకు అతీతమైన దానిని మాత్రమే నీవు స్వీకరించాలి. ఎప్పుడైతే నీకు అతీతమైన దానిని నీవు స్వీకరిస్తావో, అప్పుడు నీలో ఉండే శక్తి, సామర్థ్యం, జ్ఞానం, చైతన్యం, నీ జీవితం యొక్క ఉనికి వికసించడం జరుగుతుంది. అది నిన్ను ఉన్నతుడిగా ఉద్దరించడం జరుగుతుంది. నీకన్నా అధమమైన దానిని నీవు స్వీకరించినపుడు నీవు అరిషడ్వర్గాలకు లోబడి జీవించవలసి వస్తుంది. నీకు మధ్యస్థంగా నీవు జీవించినపుడు త్రిగుణాలకు లోబడవలసి వస్తుంది. నీకు అతీతమైన దానిని నీవు స్వీకరించినపుడు, నీలో మానవత్వం వికసించి, నీవు దైవత్వాన్ని పొంది, దివ్యత్వమును చేరుకొని, నువ్వు పరాకాష్ట పరబ్రహ్మ యొక్క సాక్షాత్కారాన్ని పొందడం జరుగుతుంది

భగవంతుని ప్రత్యక్ష ప్రేమ

మానవజన్మ అనేది శక్తి సంపాదన జన్మ కానీ శక్తిని ఎలా సంపాదించుకోవాలో మీకు తెలియడం లేదు. పరమాత్మ మనకు దేహం అనే ఒక యంత్రాన్ని ఇచ్చాడు. దేహానికి మించిన యంత్రం లేదు, మనసుకు మించిన మంత్రం లేదు, హృదయానికి మించిన తంత్రం లేదు, ఆత్మకు మించిన ధ్యానము లేదు, జీవితమునకు మించిన భగవంతుడు లేదు. మన జీవితం మనకు భగవంతుడై ఉంది. భగవంతుడు ప్రతి క్షణం పరిస్థితి ద్వారా బోధిస్తున్నాడు. సమస్య ద్వారా విద్యను అందిస్తున్నాడు. ప్రతి అనుభవం ద్వారా పరమాత్మ మనల్ని జాగృతం చేస్తున్నాడు. ఆయన బోధ సరియైన విధంగానే ఉంది. మనం స్వీకరించే విధానంలోనే చాలా రకాల మార్పులు చేర్పులు ఉన్నాయి. మనం సరియైన విధంగా పరమాత్మ ప్రేమను అందుకోలేకపోతున్నాము. ఆయన కరుణను పొందలేకపోతున్నాము. ఆయన మహిమను అనుభవించలేకపోతున్నాము. ఇంత ఉత్కృష్టమైన మానవజన్మ ఎత్తి కూడా ఈరోజు మనం భిక్షగాళ్ళలాగా బ్రతకవలసిన దుస్థితి ఏర్పడుతోంది. ఈ దుస్ధితి నుండి మనం బయటకు రావాలి. ఈ దౌర్భాగ్యం నుండి మనం బయటకు రావాలి. ఇటువంటి దురదృష్టకరమైన పరిస్థితి నుండి మనం పరిపూర్ణంగా మోక్షం పొంది తీరాలి. దానికొరకే గురువు అనే నావ ఉన్నది. 

కర్మ తత్వం

కర్మ తత్వంనీతో నీవు ఎప్పుడూ తృప్తిపడకు. ఈ ప్రపంచంతో కూడా తృప్తిపడకు. నీతో నీవు తృప్తిపడితే ఏ కర్మ చేయకుండా వికర్మ జీవితాన్ని జీవిస్తావు. ఎటువంటి సత్కర్మలు చేయవు. ఎటువంటి సత్కార్యాలు చేయవు. నిన్ను నీవు పరిపూర్ణుడిగా భావిస్తావు కాబట్టి అక్కడే ఆగిపోతావు. 

నీతో నీవు ఎప్పుడూ తృప్తిపడకు. ఈ ప్రపంచంతో కూడా తృప్తిపడకు. నీతో నీవు తృప్తిపడితే ఏ కర్మ చేయకుండా వికర్మ జీవితాన్ని జీవిస్తావు. ఎటువంటి సత్కర్మలు చేయవు. ఎటువంటి సత్కార్యాలు చేయవు. నిన్ను నీవు పరిపూర్ణుడిగా భావిస్తావు కాబట్టి అక్కడే ఆగిపోతావు. 

నువ్వు అన్ని కర్మలు చేసుకుంటూ వెళ్తే ఎప్పటికీ బాగుపడవు. ఏ దారిలోకి రావు. అన్ని కర్మలు చేయువాడు ఏ దారి లేనివాడు అవుతాడు. ఒకే కర్మ చేయువాడు ఏ గమ్యం చేరుకోడు. అందుకే మనం అన్ని రకాలుగా ప్రయోగాలు చేస్తున్నాము. సత్కర్మ అని, దుష్కర్మ అని, నిష్కామ కర్మ అని, శుద్ధచైతన్య కర్మ, అని అన్ని రకాల కర్మలు చేస్తున్నాము. అయినా పరమాత్మను చేరుకోలేకపోతున్నాము. 

భక్తిలో ఉండే మాధుర్యం

మనకు కర్మ మార్గం ద్వారా పరమాత్మను ఎలా చేరుకోవాలో తెలియదు. క్రియా మార్గం ద్వారా పరమాత్మను ఎలా చేరుకోవాలో తెలియదు. కర్త మార్గం ద్వారా పరమాత్మను ఎలా చేరుకోవాలో తెలియదు. సాక్షి మార్గం ద్వారా పరమాత్మను ఎలా చేరుకోవాలో తెలియదు. ఎఱుక మార్గం ద్వారా పరమాత్మను ఎలా చేరుకోవాలో తెలియదు. 

ప్రకటన అంటే కర్మ, కర్మ ప్రతి దానిని ప్రకటిస్తూ ఉంటుంది, కర్త ప్రదర్శిస్తుంటాడు, క్రియ శ్రవణం చెందిస్తుంటుంది. సాక్షి దర్శింపజేస్తూ ఉంటుంది, ఎఱుక సాక్షాత్కారం చెందిస్తుంది. కర్మ ఎలా చేయాలి అనేదే గురువు నీకు ఇచ్చే బోధ. ఎందుకంటే అది నిన్ను ప్రకటిస్తుంది. ఏ శక్తిని పొందడం ద్వారా మనం కాలంకు అతీతులం అవుతామో దానినే భక్తి అన్నారు. భక్తి ద్వారా మీకు కాలాతీత శక్తి ప్రాప్తిస్తుంది. కాలంకు లోబడకుండా, మృత్యువుకు లోబడకుండా, కర్మకు లోబడకుండా, నీ అజ్ఞానానికి నీవు లోబడకుండా జీవించే చైతన్య శక్తి నీకు ప్రాప్తిస్తుంది. భక్తిలో ఉండే మాధుర్యం ఇదే! 

కర్మకు లోబడకు

అష్టవిధ గురువులు బోధించేది జీవితం అనే ఒకే ఒక తత్త్వాన్నే! సద్గురువు ఏం బోధిస్తారంటే కర్మ నీకంటే చిన్నది. కర్మకు నువ్వు లోబడి జీవిస్తే కలవాటుపడతావు. నువ్వు అలవాటుకు లోబడి జీవిస్తున్నావంటే కర్మకు లోబడి జీవిస్తున్నావని అర్ధం! అలవాటు పడ్డవాడు వ్యసనాలకు లోనవుతాడు. వ్యసనానికి లోనైనవాడు జ్ఞానాన్ని కోల్పోతాడు. జ్ఞానాన్ని కోల్పోయినవాడు చైతన్యాన్ని కోల్పోతాడు. చైతన్యాన్ని కోల్పోయినవాడు ప్రేమను కోల్పోతాడు. ప్రేమను కోల్పోతినవాడు అనాథ అవుతాడు. అనాథ అయినవాడు నిరంతరం తనను తాను నాశనం చేసుకుంటూ, ప్రపంచం యొక్క నాశన దిశలోకి ప్రయాణం చేస్తుంటాడు. మనిషి యొక్క చిన్న పొరపాటు ఎక్కడికి దారి తీస్తుందో చూడండి. 

శరీరాన్ని అర్థం చేసుకో - పరమాత్మను అనుభూతి చెందు.

Understand the body – feel the Supremeశరీరం నీ ఉనికిని, నీ అస్థిత్వాన్ని, నీ చైతన్యాన్ని, నీలో ఉండే శక్తిని, నీ సామర్థ్యాన్ని, నీ యొక్క స్వస్వరూపాన్ని ప్రకటిస్తుంది. నీ గుణాలు, నీ లక్షణాలు, నీ వ్యక్తిత్వాన్నే కాదు, అంతర్ముఖమై అవ్యక్తంగా దాగి ఉన్న అనిర్వచనీయ సంపదనంతా శరీరం ఉన్నది ఉన్నట్లు ప్రకటిస్తుంది. దానిని అర్ధం చేసుకునే ప్రయత్నం చేస్తే మనం పరమాత్మను అనుభూతి చెందగలుగుతాం, అలాగే పరమాత్మగా వెలగగలుగుతాం. శరీరాన్ని ఏవిధంగా అనుభూతి చెందాలో నేర్పేవారు ఎవరూ లేరు. మీకు తోచిన విధంగా మీరు అనుభూతి చెందుతుంటారు. అలా చేయకండి. 

నీపై సద్గురువు భాద్యత

సద్గురువు మిమ్మల్ని కర్మ నుండి విముక్తుడిని చేస్తాడు. అది ఆయన మొట్టమొదటి బాధ్యత. సద్గురువు నీ సమస్త కర్మల నుండి నీకు విముక్తిని ఇచ్చి నిన్ను కర్త జీవితంలోకి ప్రవేశింపజేస్తాడు. కర్త నుండి విముక్తుడిని చేసి క్రియ జీవితంలోకి ప్రవేశింపజేస్తాడు. క్రియ నుండి విముక్తుడిని చేసి సాక్షి జీవితంలోకి ప్రవేశింపజేస్తాడు. సాక్షి నుండి విముక్తుడిని చేసి ఎఱుక జీవితంలోకి ప్రవేశింపజేస్తాడు. ఎఱుక నుండి కూడా విముక్తుడిని చేసి నిన్ను సాక్షాత్ భగవంతుడిగా వెలిగిస్తాడు. అది సద్గురువు యొక్క మొదటి బాధ్యత, కానీ దీనికి మీ తోడ్పాటు చాలా అవసరం. 

ఏది స్వీకరిస్తావో అదే నీవు అవుతావు

నువ్వు ఏది స్వీకరిస్తావో అదే నీవు అవుతావు. ఇది ప్రకటన చెప్పేటటువంటి సిద్ధాంతం. మంచిని స్వీకరిస్తే మంచి వాడివి అవుతావు. చెడును స్వీకరిస్తే చెడ్డవాడివి అవుతావు. విజయాన్ని స్వీకరిస్తే విజయాన్ని పొందుతావు. ఓటమిని స్వీకరిస్తే ఓటమిని పొందుతావు. దేనిని స్వీకరిస్తావో దానిగా నీవుగా అవతరిస్తావు.

Share.
Leave A Reply

తెలుగు