ప్రేమతత్వం | మహా ప్రేమ కీర్తన | Premamaya MahaaGuru Ji | Jai Aumaujayaa

Lyrics & Description

🎶 ప్రేమతత్వం – మహా ప్రేమ కీర్తన 🎶

ఓమౌజయత్వం ప్రేమతత్వం…
ప్రేమతత్వం ప్రేమమయా మహాగురు ప్రేమతత్వం…

మహా వటవృక్షం కింద నిశ్శబ్ద మహిమగా వెలుగై,
ప్రేమధర్మ మార్గాన్ని చూపిస్తూ,
దయ, ప్రేమ, ధ్యానం, జ్ఞానంతో
జీవితాలను ధన్యం చేస్తున్న
ప్రేమమయా మహాగురు జీ దివ్య ప్రేమతత్వానికి
ఈ మహా ప్రేమ కీర్తన భక్తిపూర్వక సమర్పణ. 🙏

సర్వ భూత హితాయ… సర్వ లోక సుఖార్థం…
ప్రతి హృదయంలో ప్రేమజ్యోతి వెలగాలి…

🙏 జై ఓమౌజయహో🙏


Lyrics:

ఓ... ఓ...
ఓమౌజయత్వం ప్రేమతత్వం ఓమౌజయత్వం
ఓమౌజయత్వం ప్రేమతత్వం ఓమౌజయత్వం
ప్రేమతత్వం ప్రేమమయా మహాగురు ప్రేమతత్వం
జై ఓమౌజయహో

ప్రేమధర్మం మార్గపు అడుగులతో
అంతరంగ సత్య ద్వారాలు తెరిచారు శ్రీప్రభు
సత్య దర్శన సన్యాస దీక్షతో సంసార సాగరం దాటిస్తున్నారు శ్రీగురు
ప్రేమతత్వం ప్రేమమయా మహాగురు ప్రేమతత్వం ఓ...
జై ఓమౌజయహో


మద మోహ మద మాత్సర్యాలు మనసుని బంధించిన సంకెళ్ళు తెంచినావు శ్రీగురు
దయ ప్రేమ ధ్యాన జపముల తపస్సుతో మా జీవితాలను ఆశీర్వదించినావు శ్రీప్రభు
నీ మార్గ దర్శనములో మానవులు ధన్యులగుతున్నారు మహాగురు
ప్రేమతత్వం ప్రేమమయా మహాగురు ప్రేమతత్వం ఓ...
జై ఓమౌజయహో


నిశ్శబ్ధ మహిమ మహా వట వృక్షం కింద జగమంతటికీ మౌనంతో వెలుగై నిలిచినావు
మహాగురు నీ శ్రీధర్మ చక్ర గమనముతో కాల చక్రమునే పవిత్ర పరిచినావు శ్రీప్రభు
ప్రేమతత్వం ప్రేమమయా మహాగురు ప్రేమతత్వం ఓ..
జై ఓమౌజయహో


మహా సుషుమ్న పాదం మహా సుషుమ్న పాదం ఆత్మ జ్యోతి మహా సుషుమ్న పాదం
జీవ దుఃఖ విమోజనం శాంతి ప్రేమ పరమార్థం
మహా సుషుమ్న పాదం జైజై జయహో


ప్రేమతత్వం ప్రేమమయా మహాగురు ప్రేమతత్వం ఓ..
జై ఓమౌజయహో

సర్వ భూత హితాయ నిత్య సత్య సాక్షాత్కారాయ మహాగురు
నీ కరుణ గంగ ప్రవహించాలి నా మనసులో
సర్వ లోక సుఖార్థం ధర్మ జ్యోతి వెలిగించుము నా ఆత్మలో నా పుణ్య జీవితంలో
ప్రేమతత్వం ప్రేమమయా మహాగురు ప్రేమతత్వం ఓ..
జై ఓమౌజయహో


తథాస్తు శాంతిరస్తు తథాస్తు
లోకాసమస్త సుఖినోభవంతు
ప్రత్యక్షం ప్రేమమయా మహాగురు ప్రత్యక్షం
ప్రేమతత్వం ప్రేమమయా మహాగురు ప్రేమతత్వం ఓ..
జై ఓమౌజయహో
ఓ... జై ఓమౌజయహో